రైతులను విడుదల చేయాలి
అనంతగిరి: లగచర్ల ఘటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్ చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పార్టీనాయకులతో కలిసి ఆనంద్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండె నొప్పితో బాధపడుతున్న రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా రైతులను విడుదల చేసి వారిపై కేసులను బేషరతుగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రైతులను విడుదల చేసేంతవరకు బీఆర్‌ఎస్ పోరాడాతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు అనంత్‌రెడ్డి, గోపాల్, రామస్వామి, కృష్ణ, సీనియర్ నాయకులు శేఖర్‌రెడ్డి, పాండు, గయాజ్, గఫార్, మైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సత్తయ్యగౌడ్, అశోక్, లక్ష్మణ్, మల్లేశం సురేశ్, రాజేందర్‌గౌడ్, మల్లికార్జున్, కృష్ణ, సంగమేశ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై రైతుల ఆగ్రహం:మహేశ్‌రెడ్డి
పరిగి: రైతులకు బేడీలు వేసి అరెస్ట్‌లు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టిన నేపథ్యంలో బీఆర్‌ఎస్ పిలుపు మేరకు పార్టీ నాయకులు మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లా డుతూ.. జైలులో గుండె నొప్పితో బాధపడుతు న్న రైతుకు బేడీలు వేసి తీవ్రవాదిలా ఆస్పత్రికి తీసుకెళ్లడం సరికాదన్నారు. రైతులను దోషులు గా చిత్రీకరించి జైలుపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్‌పై పెట్టే అక్రమ కేసులకు తలొ గ్గేది లేదన్నారు. రైతులపై అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, సురేందర్, రాజేందర్, రవికుమార్, సునంద తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్
Comments
Please login to add a commentAdd a comment