చెరసాల నుంచి.. చేనుబాట
దుద్యాల్: ఆటపాటలతో నేల తల్లి ఒడిలో జీవనం సాగించే గిరిజనులకు లగచర్ల ఘటన వారి జీవితాల్లో మరిచిపోలేనిది. తమ భూములను కాపాడుకోవడానకి జరిగిన పోరాటంలో చోటుచేసుకున్న పొరపాటుకు జైలు పాలైన లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంటతండాలకు చెందిన రైతులు.. 37 రోజులుగా జైలు జీవితం గడిపారు. కటకటాల నుంచి శుక్రవారం విడుదలైన కర్షకులు.. శనివారం తమ కుటుంబ సభ్యులతో కలిసి పొలం బాట పట్టారు. జైలు జీవితం వారి మాటల్లోనే..
జీవితంపై విరక్తి కల్గింది
కటకటాల్లో ఉన్నన్ని రోజులు బతుకుపై విరక్తి కలిగింది. నిత్యం ఏదో ఒక పని చేసుకుని ప్రశాంతంగా జీవించే నేను.. జైలు పాలు కావడంతో నా కుటుంబం మనోవేదనకు గురయింది. పంచాయితీతో ప్రమేయం లేకున్నా పోలీసులు తీసుకెళ్లారు. 37 రోజులు నిద్రాహారాలు లేకుండా గడిపా. ఇటివలే ప్రేమ వివాహం చేసున్నా. కుటుంబానికి దూరంగా ఉండడం కంటే చచ్చిపోవడం మేలనిపించింది. పొలానికి రాగానే పశువులు నన్ను చూసి అరిచాయి. దీంతో నాకు ఏడుపు వచ్చింది. సంతోషంగా వాటికి స్నానం చేయించా. – వినోద్ నాయక్, రోటి బండ తండా
పొలం పనుల్లో లగచర్ల గిరిజన రైతులు బిజీ
నరకం నుంచి విముక్తి కలిగిందంటున్న కర్షకులు
గ్రామాల్లో నెలకొన్న ప్రశాంత వాతావరణం
Comments
Please login to add a commentAdd a comment