ఆరంభం.. అట్టహాసం
● ప్రారంభమైన పత్రీజీ ధ్యాన మహాయాగ వేడుకలు
● జ్యోతి ప్రజ్వలన చేసిన ఎంపీలు మల్లురవి, నాగరాజు
● వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ధ్యానులు
కడ్తాల్: మండల కేంద్రం సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో శనివారం ధ్యాన జనుల సందడి మధ్య పత్రీజీ ధ్యాన మహాయాగం–3 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నాగర్‌కర్నూల్, కర్నూలు ఎంపీలు మల్లురవి, నాగరాజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, దివంగత ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ కూతురు పరిణిత, ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఎంపీ మల్లురవి మాట్లాడుతూ.. ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి పత్రీజీ అని, ధ్యానమయ సమాజం కోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయనీయమని కొనియాడారు. పత్రీజీ చూపిన ధ్యాన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. ధ్యానంతోఆరోగ్యంతో పాటు, మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. కర్నూల్ ఎంపీ నాగరాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని, ధ్యానంతో తమ జీవితాలను బాగు చేసుకోవాలని సూచించారు. పత్రీజీ ఆశయాలకు అనుగుణంగా ధ్యాన యజ్ఞం నిరంతరం కొనసాగాలని ఆకాంక్షించారు.
అఖండ జ్యోతికి ఘన స్వాగతం
అంతకు ముందు రాష్ట్రం నలుమూలాల నుంచి తిరిగి వచ్చిన అఖండ జ్యోతికి కడ్తాల్‌లో ధ్యానులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అఖండ జ్యోతితో పిరమిడ్ వద్దకు ర్యాలీగా సాగారు. పలువురు పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సంగీత కార్యక్రమాలు అలరించాయి. ధ్యానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ట్రస్టు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ భాస్కర్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దశరథ్‌నాయక్, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.
ధ్యానంలో మహిళ
Comments
Please login to add a commentAdd a comment