మధ్యాహ్న భోజనంలో పురుగులు
కుల్కచర్ల: ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో భోజనం సమస్యలపై నిత్యం ఏదో ఒక చోట సమస్యలు వెలుగుచూస్తున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదు. చౌడాపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వడ్డించిన మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడం కలకలం రేపింది. విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వెళ్లిన గ్రామస్తులు ప్లేట్లలోని అన్నాన్ని పరిశీలించగా పురుగులు కనిపించాయి. ఈ విషయమై సిబ్బందిని నిలదీశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ.. సరైన భోజనం వడ్డించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కడుపు మాడ్చుకోలేక పెట్టింది తింటున్నామని చెప్పారు. ఈ విషయాలు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో చౌడాపూర్ తహసీల్దార్ ప్రభు స్కూల్‌కు చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ఉండటంలేదని విద్యార్థులు ఆయనకు చెప్పడంతో ఇకనుంచి నిర్లక్ష్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్‌ఎం భాగ్యవతి, ఉపాధ్యాయులను హెచ్చరించారు.
చౌడాపూర్ పాఠశాలలో ఘటన
స్కూల్‌ను సందర్శించిన తహసీల్దార్
విద్యార్థులు, సిబ్బంది నుంచి వివరాల సేకరణ
Comments
Please login to add a commentAdd a comment