సీఎం రేవంత్‌రెడ్డికి నూతన శుభాకాంక్షలు
పరిగి: సీఎం రేవంత్‌రెడ్డిని బుధవారం పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి నగరంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో అన్నీ శుభాలే కలగాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు.
హ్యాపీ న్యూ ఇయర్..
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరారు.
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
అనంతగిరి: తమ సమస్యలను పరిష్కరించే దాకా ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాంగ్యనాయక్ అన్నారు. వికారాబాద్‌లోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న సమ్మె బుధవారం నాటికి 27వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను వెంటనే రెగ్యూలర్ చేయాలన్నారు. ఎస్‌ఎస్‌ఏను విద్యాశాఖలో విలీనం చేయాలన్నారు. తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రవికుమార్, శ్రీశైలం, రఘుసింగ్ ఠాకూర్, బ్రహ్మయ్య చారి, లక్ష్మయ్య, ప్రమోద్, శేఖర్, వసంత, శ్రీనివాస్, రవి, మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
పాము కాటుతో ఎద్దు మృతి
కుల్కచర్ల: పాము కాటు వేయడంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..పుట్టపహాడ్ గ్రామానికి చెందిన చిల్ల బుగ్గయ్య అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎద్దును పాము కాటేసింది. కొద్ది సేపటికే అది కుప్పకూలి చనిపోయింది. సుమారు రూ.80 వేల విలువ చేసే ఎద్దు మృతి చెందడం పట్ల భాధిత రైతు మనోవేదనకు గురైయ్యారు. ప్రభుత్వం ఆదుకోవా లని బాధిత రైతు కోరారు.
విజయవంతం చేయాలి
అనంతగిరి: నగరంలో ఈ నెల 7న తలపెట్టిన లక్ష డప్పులు.. వెయ్యి గొంతులు.. అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంఎస్‌పీ జాతీయ నాయకుడు మద్దిలేటి మాదిగ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిదాస్ పిలుపునిచ్చారు. బుధవారం వికారాబాద్‌లో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నాయకుల సమావేశం జరిగింది.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ..ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అడ్డుపడుతున్న దుష్ట శక్తులను తిప్పి కొట్టి.. వారి గుండెలదిరేలా ప్ర తి ఒక్కరూ డప్పులతో హైదరాబాద్‌ను ము ట్ట డించి దండోరా మోగించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ఆనంద్, మల్లికార్జున్, ప్రకాష్,మహేందర్, కృష్ణనరసింహ, మల్కప్ప, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment