కొత్త సంవత్సరం వేడుకలను జిల్లా ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. మంగళవారం రాత్రి నుంచే వేడుకల్లో మునిగితేలారు. అర్ధరాత్రి 12గంటలు కాగానే కేక్ కట్ చేసి 2025 సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. అలాగే 2024కు వీడ్కోలు చెప్పారు. కోట్‌పల్లి ప్రాజెక్టుకు, అనంతగిరి గుట్టకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చి న్యూ ఇయర్ వేడుకలు చేసుకున్నారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment