సాగునీరు అడవిపాలు
ధారూరు: కోట్‌పల్లి ప్రాజెక్టు బేబీ కేనాల్‌పై నిర్మించిన 3వ కల్వర్టు దెబ్బతినడంతోపంట పొలాలకు చేరాల్సిన నీరు వృథాగా అడవిలోకి ప్రవహిస్తోంది. రబీ పంటల కోసం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. బూర్గుగడ్డకు వెళ్లే దారిలో ఉన్న కల్వర్టు పగిలిపోవడంతో నీరు వృథాగా పోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రైతులు నీటి వృథాను గుర్తించి ప్రాజెక్టు సిబ్బంది, ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేబీ కెనాల్ తూము షట్టర్ సరిగ్గా పనిచేయడం లేదని, షట్టర్ పూర్తిగా కిందకు దిగకపోవడంతో కాలువలో ఎక్కువ నీరు పోతోందని రైతులు తెలిపారు. ఈ కారణంగానే కల్వర్టు దెబ్బతిని నీరు అడవిలోకి వృథాగా పోతోందన్నారు. ఈ విషయాన్ని ఏఈ మాధవిలత దృష్టికి తీసుకెళ్లగా సమస్యను వర్క్ ఇన్‌స్పెక్టర్ వివరించి పరిష్కరిస్తామని తెలిపారు.
దెబ్బతిన్న కోట్‌పల్లి బేబీ కెనాల్ కల్వర్లు
ఆందోళనలో రైతన్న
Comments
Please login to add a commentAdd a comment