కొత్త కిక్కు రూ.కోట్లలో..
ఉమ్మడి జిల్లాలో చివరి మూడు రోజుల్లో రూ.207.95 కోట్ల ఆదాయం
1,74,166 కేసుల మద్యం, 2,03,609 కేసుల బీర్ల అమ్మకాలు
గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన ఆదాయం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: 2024 డిసెంబర్ చివరి మూడు (29, 30 ,31 తేదీల్లో) రోజుల్లో ప్రభుత్వానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మద్యం అమ్మకాలు కాసుల వర్షం కురిపించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు ఎక్సైజ్ జిల్లాలు ఉండగా, వీటి పరిధిలో 20 ఎక్సైజ్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. 2023 డిసెంబర్ చివరి మూడు రోజులతో పోలిస్తే.. 2024 డిసెంబర్ చివరి మూడు రోజుల్లో ఆదాయం కొంత తగ్గినప్పటికీ (రూ.75 లక్షల).. కేవలం మూడు రోజుల్లోనే రూ.207.95 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.
జిల్లా వాసులంతా పాత(2024) సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త(2025) సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. యువతీ, యువకులు డిసెంబర్ 31 మధ్యాహ్నం నుంచే వేడుకల్లో మునిగితేలారు. బార్లు, వైన్స్‌మందుబాబులతో కిక్కిరిసి పోయాయి. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్, కేకులు, చికెన్, మటన్, చేపల అమ్మకాలు భారీగా జరిగాయి.
2023 చివరి మూడు రోజులతో పోలిస్తే 2024లో మేడ్చల్, శంషాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో ఆదాయం కొంత తగ్గగా, మల్కాజ్‌గిరి, సరూర్‌నగర్, వికారాబాద్ ఎక్సైజ్ జిల్లాల పరిధిలో అమ్మకాలు కొంత పెరగడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment