రోగులతో ప్రేమగా మెలగాలి
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్
దుద్యాల్: ఆస్పత్రికి వచ్చే రోగులతో ప్రేమగా మెలగాలని.. చికిత్స అందించే విషయంలో ఇబ్బందులు తల్తెతకుండా చూసుకోవాలని వికారాబాద్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన మండల పరిధిలోని హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో పలు రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. గతంలో ఆస్పత్రి వసతి లేక పేదలు కోస్గి, కొడంగల్, పరిగి, మహబూబ్‌నగర్ వెళ్లేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ నిర్మల ఇతర సిబ్బంది ఉన్నారు.
సీజ్ చేసిన వాహనాలకు 19న వేలం
తుర్కయంజాల్: ఇబ్రహీంపట్నం ఆర్టీఏ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను ఈ నెల 19న వేలం వేయనున్నట్లు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుభాష్ చందర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మహేశ్వరం, బండ్లగూడ, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం పరిధిలో పన్నులు చెల్లించని, ఇతర కారణాలతో సీజ్ చేసిన వాహనాలను మన్నెగూడలోని ఆర్టీఏ కార్యాలయంలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు రూ.500 దరఖాస్తు రుసుము, డిపాజిట్ రూ.2 వేలు చెల్లించాలని సూచించారు. సీజ్ అయిన వాహనాలను యజమానులు తీసుకోవాలనుకుంటే ఈనెల 18లోపు ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. వేలం వేయనున్న వాహనాల వివరాలు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
యూపీ టు సిటీ
అక్రమంగా ఆయుధాల సరఫరా
సాక్షి, సిటీబ్యూరో: ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కు ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర నిందితుడిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 తుపాకులు, 10 బుల్లెట్లు, తపంచాలను స్వాధీనం చేసుకున్నా రు. మంగళవారం రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారంఉత్తరప్రదేశ్‌కు చెందిన హరేకృష్ణ జాదవ్ 2019లో తన అన్న మురళితో కలిసి హైదరాబాద్‌కు వచ్చాడు. బీబీనగర్‌లోని ఓ కంపెనీలో పనిలో చేరాడు. మూడేళ్ల పాటు పనిచేసిన తర్వాత 2022లో ఉద్యోగాన్ని వదిలేసి సొంతూరు రాంపూర్ బోహాకు వెళ్లిపోయాడు. అక్కడే పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. హరేకృష్ణ స్వగ్రామం బిహార్‌కు సరిహద్దు కావడంతో అక్కడ అక్రమంగా ఆయుధాలు తయా రు చేసేవారితో ఇతనికి పరిచయాలు ఏర్పడ్డా యి. వ్యవసాయంలో పెద్దగా సంపాదన లేక పోవడంతో అక్రమంగా డబ్బు సంపాదించాల ని నిర్ణయించుకున్నాడు. తక్కు వ ధరకు తుపాకులు కొనుగోలు చేసి, హైదరాబాద్‌లో విక్రయించాలని పథకం వేశాడు. ఈక్రమంలో బిహార్‌లోని షాపూర్ గ్రామానికి చెందిన సంపత్ యాదవ్ నుంచి 3 ఆయుధాలు కొనుగోలు చేశాడు. వీటిని తీసుకొని బుధవారం హైదరా బాద్ వచ్చాడు. జవహర్‌నగర్ ఠాణా పరిధిలో ని అంబేడ్కర్ నగర్ బస్టాప్ వద్దకు చేరుకున్నా డు. సమాచారం అందుకున్న భువనగిరి స్పెష ల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ), జవహర్‌నగర్ పోలీసులు హరేకృష్ణ జాదవ్‌ను అరెస్టు చేశారు.
చైనా మాంజా చుట్టుకుని..
బాలుడికి గాయాలు
బంట్వారం: గాలిపటం ఎగురవేస్తున్న బాలుడు చైనా మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని బొప్పునారంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన ఆనంద్, లక్ష్మి దంపతుల కుమారుడు ధనుష్ (7) సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి కాళ్లకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబీకులు కర్ణాటక రాష్ట్రంలో ని కుంచారం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం నిమిత్తం తాండూరుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment