వర్గీకరణతోనే ఉపకులాలకు న్యాయం
తాండూరు టౌన్: ఎస్సీ వర్గీకరణతోనే ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ మాదిగ అన్నారు. లక్ష డప్పులు, వేయి గొంతుల పేరుతో వచ్చే నెల 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహా ప్రదర్శనలో భాగంగా నిర్వహిస్తున్న ప్రచార రథయాత్ర శుక్రవారం తాండూరు పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌక్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ త్వరగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వర్గీకరణ జరిగితేనే ఎస్సీ ఉపకులాలకు వాటా ప్రకారం న్యాయం జరుగుతుందన్నారు. దీనిలో భాగంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా లక్ష డప్పులు, వేయి గొంతుల ప్రదర్శన చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాంచందర్ మాదిగ, ఆనంద్ మాదిగ, స్వామిదాస్, నర్సింలు, కృష్ణ, ప్రకాష్, మహేందర్, శివాజీ, బలరాం తదితరులు పాల్గొన్నారు.
తాండూరుకు చేరుకున్న రథయాత్ర
Comments
Please login to add a commentAdd a comment