వాహన బీమా.. తస్మాత్ జాగ్రత్త!
శంషాబాద్: వాహనాలకు నకిలీ బీమాలు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. వాహనదారులు ప్రమా దం జరిగిన తర్వాత సంబంధిత కంపెనీలకు క్‌లైమ్ చేయడంతో వీరి అసలు రంగు బయటపడింది. శంషాబాద్ పట్టణంలో నకిలీ ఇన్సూరెన్స్‌ల ద్వారా నష్టపోయిన వారు సైబరాబాద్ పోలీసులకు ఆశ్రయించడంతో నకిలీలకు పాల్పడుతున్న ముఠాలోని ముగ్గురిని శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించా రు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్టీఏ ఏజెంట్‌లే..
నకిలీ బీమాలు చేస్తున్న వారిలో ప్రధానంగా ఆర్టీఏ ఏజెంట్‌లే ఉన్నారు. ప్రధాన నిందితుడుగా కిషన్‌బాగ్‌కు చెందిన అవేస్ (32), శంషాబాద్ ఆర్‌బీనగర్ కాలనీలో నివాసముంటున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన శ్రావణ్‌కుమార్‌గౌడ్(31) షాబాద్ మండలంలోని సర్ధార్ నగర్‌కు చెందిన మోర్పు శిశకుమార్‌లు ఈ దందా నడిపిస్తున్నారు. ఇందులో ఇద్దరు ఆర్టీఏ ఏజెంట్‌లుగా పని చేస్తున్నారు. ఈ ముగ్గురు కలిసి నగరలోని ప్రకాష్, అజిమ్, అస్లాం, శ్రీనివాసులు, మజహర్, రవికాంత్, లైకుద్దీన్, ఖాజా, ఐజాజ్, హసన్, రాములతో కలిసి నకిలీ బీమాల దందా కొనసాగిస్తున్నారు.
బాధితుల ద్వారానే..
నకిలీ ముఠా నుంచి ఓ ప్రైవేటు సంస్థ ద్వారా బీమా పాలసీలు పొందిన కొందరు బాధితులు వాహన ప్రమాదానికి గురైన తర్వాత సంబంధిత సంస్థలను ఆశ్రయించడంతో అవి నకిలీవీగా తేలాయి. దీంతో వారు పోలీసులకు ఆశ్రయించారు. ఎస్‌ఓటీ పోలీసులు నిఘావేసి శుక్రవారం ఉదయం ప్రధాన నిందితులైన ముగ్గురిని తొండుపల్లి వద్ద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి మూడు వాహనాలు, కంప్యూటర్లు, నకిలీ బీమా పత్రాలు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నగర వ్యాప్తంగా నకిలీ బీమా ముఠాకు చెందిన బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు.
నగరంలో విస్తరించిన నకిలీ ముఠా
పట్టుబడ్డ ముగ్గురు నిందితులు.. పరారీలో 11 మంది
Comments
Please login to add a commentAdd a comment