కొడంగల్: రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే శుక్రవారం నాటికి సగం పూర్తి అయిందని తహసీల్దార్ విజయ్‌కుమార్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేను పారదర్శకంగా చేయాలని ఆదేశించారు. కొడంగల్ మండలంలో 1068 మంది, మున్సిపల్ పరిధిలో 294 మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ బలరాం నాయక్, డీటీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అర్హుల గుర్తింపు
బొంరాస్‌పేట: మండలంలో రేషన్ కార్డుల సర్వే ముమ్మరంగా సాగుతోంది. శుక్రవారం రేగడిమైలారం, మూడుమామిళ్లతండా తదితర గ్రామాల్లో రెవెన్యూ అధికారులు, సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటివద్దకు వెళ్లి సర్వే చేశారు. రేగడిమైలారంలో 53మంది, మూడుమామిళ్లతండాలో 18మంది దరఖాస్తుదారుల కుటుంబాలను పరిశీలించారు. ఎంపీడీఓ వెంకన్‌గౌడ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
యాలాలలో..
యాలాల: అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని యాలాల తహసీల్దార్ అంజయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని విశ్వనాథ్‌పూర్ గ్రామంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సేకరించారు.
బంట్వారంలో..
బంట్వారం: రేషన్‌కార్డుల వెరిఫికేషన్ కొనసాగుతుంది. మండలంలోని తొర్మామిడి గ్రామంలో తహసీల్దార్ విజయ్‌కుమార్ శుక్రవారం రేషన్‌కార్డుల జాబితా ప్రకారం వివరాలు సేకరించారు. వెరిఫికేషన్ ఆధారంగా నమోదు చేసిన వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
సర్వే షురూ
మోమిన్‌పేట: మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో రేషన్ కార్డ్లు సర్వే ప్రారంభమైంది. రెవెన్యూ అధికారులు దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. మండల వ్యాప్తంగా 812 మంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి వివరాలను తీసుకొంటున్నారు.
తప్పులు ఉండొద్దు
దోమ: కొత్త రేషన్ కార్డు సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని తహసీల్దార్ పురుషోత్తం, ఎంపీడీఓ మహేశ్‌బాబు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బొంపల్లి గ్రామంలో రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు నిర్వహిస్తున్న సర్వేను వారు పరిశీలించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment