సాగేతర భూముల సర్వే పరిశీలన
యాలాల: రైతు భరోసా పథకంలో భాగంగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న సాగేతర భూముల సర్వేను తాండూరు సబ్ కలెక్టర్ హరిశంకర్ ప్రసాద్ పరిశీలించారు. శుక్రవారం మండలంలోని అగ్గనూరు క్లస్టర్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ విజయ్‌కుమార్, ఏఈఓ గోపి తదితరులు భూముల వివరాల సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా జుంటుపల్లి, అగ్గనూరు క్లస్టర్లలో ఉన్న భూముల వివరాలను జాగ్రత్తగా సేకరించాలన్నారు. అర్హులైన వారికి తప్ప, అనర్హులకు రైతు భరోసా అందరాదని పేర్కొన్న ప్రభుత్వ నిబంధనలు తూచ తప్పకుండా పాటించేలా చూడాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment