భారీగా బకాయిలు
8లోu
వికారాబాద్‌లో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి వచ్చిన పత్తి
వికారాబాద్: జిల్లాలో పత్తి రైతుకు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఓ పక్క ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతూనే సెంటర్లను మూసేస్తున్నారు. జి ల్లాలో గత ఏడాది నవంబరు మొదటి వారంలో సీసీఐ ఆధ్వర్యంలో 14 కొనుగోలు కేంద్రాలను ఏ ర్పాటు చేశారు. ప్రస్తుతం నాలుగు మినమా మిగ తావి మూతపడ్డాయి. దాదాపు కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. డబ్బుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కేంద్రాలను ప్రారంభించింది మొదలు పదే పదే మూసివేయడం తర్వాత తెరవటం వంటివి చేశారు. మిల్లర్లు వ్యాపారులు తెచ్చిన పత్తిని దించుకుంటూ రైతులకు మా త్రం స్థలం లేదని.. రెండు మూడు రోజుల తర్వాత రావాలని సెంటర్లు మూసి వెళ్తున్నారు. దీంతో దళారులకు పత్తి విక్రయించుకోవాల్సి వస్తోందని రైతు లు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాలకు భారీగా పత్తి వస్తున్న సమయంలో సెంటర్లను మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2.3 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా ఇప్పటి వరకు 1,25,677 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు.
కొన్నది సగమే..
సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోలు లక్ష్యం బారెడు, సేకరణ మూరెడు అన్న చందంగా తయారైంది. జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేశారు. తాండూరు, వికారాబాద్, పరిగి ప్రాంతాల్లో మూడు చొప్పున, మర్పల్లి, కోట్‌పల్లి, ధారూరు, కొడంగల్, పూడూరులో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 2.30 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయగా.. ఒక్కో ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల చొప్పున మొత్తం 2.3లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇప్పటి వరకు 54వేల మంది రైతుల నుంచి 1,25,677 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు.
రూ.100 తగ్గించి కొనుగోలు
కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి రూ.7,521 మద్దతు ధర నిర్ణయించింది. అయితే ఆ ధరలో వంద రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు, జిన్నింగ్ మిల్లులు, బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.6,500 కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రూ.1000 వరకు నష్టపోతున్నారు. బహిరంగ మార్కెట్‌లో పత్తి విక్రయిస్తే వెంటనే డబ్బులు ఇస్తుండటంతో రైతులు అటువైపే మొగ్గుచూపుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో కొర్రీల కారణంగా ఆసక్తి చూపడంలేదు. పొట్టి పింజ, పొడుపు పింజ రకం అనే తేడాతో ధర తగ్గిస్తున్నారు. వాతావరణ పరిస్థితులతో కొద్దిగా రంగు మారిగా పత్తిని తిప్పి పంపుతున్నారు. ఇదిలా ఉండగా రైతులకు చెల్లించాల్సిన బకాయీలు భారీగా పెరిగిపోతున్నాయి. 1,25,677 మెట్రిక్ టన్నులకు సంబంధించి రూ.932 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.292 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. మరో రూ.640 కోట్లు చెల్లించాల్సి ఉంది. వెంటనే డబ్బు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.
గతేడాది నవంబరులో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ఇప్పటి వరకు సేకరించింది 1,25,677 మెట్రిక్ టన్నులు చెల్లించాల్సిన డబ్బు రూ.932 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయిన మొత్తం రూ.292 కోట్లు బకాయిలు రూ.640 కోట్లు ముగింపు దశకు కొనుగోళ్ల ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment