సర్వే పారదర్శకంగా ఉండాలి
ధారూరు: మండలంలోని ఎబ్బనూర్‌లో రేషన్‌కార్డు ల సర్వే ప్రక్రియను శుక్రవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ పరిశీలించారు. ప్రజా పాలనలో దరఖా స్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించా రు. పాత రేషన్ కార్డులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. సర్వే పారదర్శకంగా ఉండాలని, అర్హులకు ప్రయోజనం చేకూరేలా సర్వే నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ సాజిదాబేగం, డిప్యూటీ తహసీల్దార్ విజయేందర్ పాల్గొన్నారు.
వ్యవసాయేతర భూముల పరిశీలన
మండల కేంద్రంలోని వ్యవసాయ భూముల్లో వెలిసిన కాలనీలను శుక్రవారం అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీఓ వాసుచంద్ర, జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి, తహసీల్దార్ సాజిదాబేగం పరిశీలించారు. వీటికి గతంలో రైతుబంధు వచ్చిందా అని ఏఈఓలను ప్రశ్నించగా వచ్చిందనే సమాధానం ఇచ్చారు. ఇకనుంచి సాగుకు యోగ్యమైన భూములకు మాత్రమే రైతుభరోసా వస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయేతర భూములను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ఆయన వెంట ఏఈఓలు సంజూరాథోడ్, సంతోష్ ఉన్నారు.
● అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
Comments
Please login to add a commentAdd a comment