అభివృద్ధి పనులు ప్రారంభించండి
● లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ ● పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ● కిష్టాపూర్‌లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన
ఆరోగ్యశ్రీ రంగారెడ్డి కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌రెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌గా డాక్టర్ సతీష్‌రెడ్డి నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఇక్కడ పని చేసిన డాక్టర్ నరేష్ పదోన్నతి పొంది రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ హెడ్ ఆఫీసుకు బదిలీ అయ్యారు. పదోన్నతిపై వెళ్లిన డాక్టర్ నరేష్‌కు వీడ్కోలు పలికారు.
కొడంగల్: నియోజకవర్గానికి మంజూరైన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ ఆదేశించారు. గురువారం పట్టణంలోని కడా కార్యాలయంలో కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వికారాబాద్, నారాయణపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్‌జైన్, శిక్తాపట్నయక్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బీసీ గురుకుల పాఠశాలలు, జూనియర్ కలాశాలలతోపాటు బొంరాస్‌పేట, గుండుమాల్ మండలాల్లో చేపట్టే సమీకృత పాఠశాల భవనాల నిర్మాణ పనులను త్వరలో చేపట్టాలని సూచించారు. వెటర్నరీ, వైద్య కళాశాలలకు సంబంధించి పనులను ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్లు ఉమాహారతి, గరిమనరుల, కడా కార్యాలయ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, నారాయణపేట ఆర్డీఓ రామచందర్, పంచాయత్‌రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వసంత్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment