అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ పరిధిలో ఇప్పటి వరకు 56.35శాతం పన్నులు వసూలు చేశారు. మరో రెండు నెలల్లో 100శాతం వసూలు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. గత ఏడాది 91.66 శాతం వసూలు చేశారు. ఈ సారి కాస్త వెనుకంజలో ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం రెండు మూడు నెలల నుంచి మున్సిపల్ బిల్ కలెక్టర్లకు సమగ్ర కుటుంబ సర్వే, ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్లు తదితర సర్వేలు, రేషన్ కార్డుల సర్వే, వార్డు సభలు వంటి బాధ్యతలు అప్పగించడంతో పన్నులు వసూళ్లపై శ్రద్ధ పెట్టలేకపోయారు. మున్సిపల్ పరిధిలో 15,092 ఇండ్లు ఉండగా పన్ను రూపంలో రూ.4.38 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 2.46కోట్లు వసూలు చేశారు. ఇంకా 1.91కోట్లు వసూలు చేయాల్సి ఉంది. స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేసి వంద శాతం లక్ష్యం చేరుకుంటామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి వంద శాతం పన్నులు వసూలు చేస్తామని మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment