ఆ పార్టీలను నమ్మే పరిస్థితి లేదు
చేవెళ్ల: ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పగా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టిందని, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక అభాసుపాలు అవుతోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్‌లో గురువారం ఇటీవల నూతనంగా ఎన్నికై న బూత్‌స్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, కేంద్రం నుంచి వచ్చే నిధులే ఇప్పుడు దిక్కయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను నమ్మే పరిస్థితి లేదన్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అన్నారు. బీజేపీ బలోపేతాన్ని చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు బదనాం చేసేందుకు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించటంతోపాటు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారికి బుద్ధి చేపేందుకు త్వరలో ప్రజాచైనత్య యాత్రలు నిర్వహించనున్నట్టు వివరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్న, కంజర్ల ప్రకాశ్, అసెంబ్లీ కన్వీనర్ ప్రపతాప్‌రెడ్డి, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది
హామీల అమలులో కాంగ్రెస్ అభాసుపాలు
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment