● ఎమ్మెల్యే సబితా రెడ్డి ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
మీర్‌పేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే సర్వేలు, సభలు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి విమర్శించారు. కార్పొరేషన్‌లో రూ.4.42 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్హులందరికీ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తామని ఓ వైపు మంత్రులు చెబుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం తాము చెప్పిన వారికే ఇస్తామనడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తుండడంతో గ్రామ సభలను నిర్భందాల మధ్య నడుపుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వ హయాంలో మీర్‌పేట, బడంగ్‌పేట, జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలకు మంజూరు చేసిన కోట్లాది రూపాయలను నిలిపివేయడం రాజకీయం కాదా అని నిలదీశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్వేలు, సమావేశాలతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌కు రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మేయర్ ఎం.దుర్గ, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, ఫ్లోర్‌లీడర్ అర్కల భూపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు ఎనుగుల అనిల్‌యాదవ్, మాదరి సురేఖ, బొక్క రాజేందర్‌రెడ్డి, గడ్డమీది రేఖ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment