రాష్ట్రంలోచివరి స్థానం
తాండూరు: మరో రెండు నెలల్లో 2024–25 ఆర్థిక సంవత్సరం ముగియనుంది.. మున్సిపాలిటీకి ఆస్తి పన్నే ప్రధాన ఆదాయ వనరు. ఇంటి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. ఆన్‌లైన్ ద్వారా పన్నులు సేకరించాలి. అయితే ఇందుకు వినియోగించే మిషన్లు 6 నెలలుగా పని చేయడం లేదు. దీంతో ఇప్పటి వరకు కేవలం 12.12 శాతమే వసూలు చేశారు. మిగిలిన పన్నులు మార్చి నెలాఖరుకు పూర్తి చేసే అవకాశం కనిపిండం లేదు. గత ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే పన్నుల వసూలు ప్రక్రియను ప్రారంభించి మార్చి నాటికి 100 శాతం లక్ష్యం చేరుకునేవారు. అయితే తరచూ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు తీసుకోవడం.. సర్వేలు చేయించడం లాంటివి పన్నుల వసూలుపై ప్రభావం పడింది. తాండూరు మున్సిపాలిటీలో 36 వార్డులు 14,707 ఆవాసాలున్నాయి. ఏటా ఆస్తి పన్ను రూపంలో మున్సిపాలిటీకి రూ.13.04కోట్ల ఆదాయం చేకూరుతుంది. ఈ సారి పన్నుల వసూలులో అధికారులు ఆసక్తి చూప లేదనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు రూ.1.58 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేయగా ఇంకా రూ.11.02 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మొత్తం 152 మున్సిపాలిటీలున్నాయి. ఆస్తి పన్ను వసూలులో తాండూరు మున్సిపాలిటీ రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. వచ్చే నెల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పన్నుల వసూలుకు కొత్త యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment