కొడంగల్ మున్సిపల్ కార్యాలయం
మున్సిపాలిటీల్లో పన్నుల వసూలు డీలా పడ్డాయి. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలల్లో ముగియనుండగా పన్నుల వసూళ్లు ఇంకా 50 శాతం దాటడంలేదు. జిల్లాలోనే పెద్ద మున్సిపాలిటీ అయిన తాండూరులో పరిస్థితి మరి అధ్వానంగా తయారైంది. ఇక్కడ కేవలం 12 శాతమే వసూలు చేశారు. పరిగి మున్సిపాలిటీలో రూ.1.5 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.75 లక్షలు వసూలు చేశారు. వికారాబాద్‌లో రూ.4.38 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు రూ.2.46 కోట్లు వసూలు చేశారు. కొడంగల్‌లో రూ.1.95 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా రూ. 82 లక్షలు మాత్రమే వసూలు చేశారు. ఇక తాండూరులో రూ.13 కోట్లకు గాను రూ.1.85 కోట్లు అంటే 12.12 శాతం వసూలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment