కొడంగల్: కొడంగల్ పురపాలక సంఘానికి సంబంధించి ఈ ఏడాది 42 శాతం పన్ను వసూలు చేశారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.194. 82 లక్షలు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు రూ. 81.96లక్షలు వసూలు చేశారు. 42.7 శాతం వసూలు అయినట్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి రూ.20.72 లక్షలు ఉండగా రూ.82 వేలు వసూలు చేశారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి ప్రాపర్టీ టాక్స్ రూ.165.32 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా రూ.78.51 లక్షలు మాత్రమే వసూలు చేశారు. 68.79 శాతం వసూలైంది. ఇందులో ప్రభుత్వ భవనాలకు సంబంధించి ప్రాపర్టీ టాక్స్ రూ.16.07 లక్షలు ఉండగా రూ.2.7 లక్షలను వసూలు చేశారు. మార్చి నెల చివరి వరకు వందశాతం పన్ను వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment