కేటీఆర్.. చిల్లర రాజకీయాలు మానుకో..
పరిగి: కుల్కచర్ల మండలంలో మహనీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన కేటీఆర్ చిల్లర రాజకీయాలు చేశారని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని లేకుంటే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టీ రామ్మోహన్‌రెడ్డి హితవు పలికారు. ఆదివారం పరిగి పట్టణంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించినా తండ్రీ కొడుకులకు బుద్ధిరాలేదన్నారు. కేటీఆర్.. సీఎంపై సొల్లు వాగుడు ఆపాలని హితవు పలికారు. బీఆర్‌ఎస్ హయాంలో పథకాల అమలు బాగుందో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో బాగుందో ప్రజల వద్దకు వెళ్లి చర్చిద్దామని సవాల్ విసిరారు.. కేసీఆర్ చరిత్ర తెలిసే ప్రజలు ఫాంహౌస్‌లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ప్రజా ఉద్యమాలతో సీఎం అయ్యారని పేర్కొన్నారు.. కేసీఆర్ అంటే నమ్మక ద్రోహం అని.. రాష్ట్రానికి పట్టిన చీడపురుగు అని.. అందుకే ప్రజలు ఓడించారన్నారు. రాష్ట్రంలో చచ్చిన పార్టీ బీఆర్‌ఎస్ అని ఎలా బతికించుకోవాలో తెలియక తిప్పలు పడుతున్నారని అన్నారు. కేసీఆర్ కుటుంబానిది నీచమైన చరిత్ర అని.. నీ చెల్లెలు లిక్కర్ స్కాంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని అంతర్జాతీయంగా మంటగలిపావని అన్నారు.. కేసీఆర్ పదేళ్లలో చేసింది మేము అఽధికారం చేపట్టిన ఏడాదిలోనే చేసి చూపించామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో రూ.62 వేల కోట్లు రైతుల సంక్షేమానికి ఖర్చు చేశామన్నారు. రూ.23 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రైతు భరోసా కింద గత ఏడాది రూ.12వేల కోట్లు ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ ఇస్తున్నామన్నారు. జనవరి 26న ఒకే సారి నాలుగు పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. తండ్రి, కొడుకులు ఎప్పుడైనా జైలుకు వెల్లడం ఖాయమన్నారు. పరిగి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, ఆంజనేయులు, ఆనందం, అశోక్, అయూబ్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చిత్తుగా ఓడించినా బుద్ధి రాలేదు
చచ్చిన పార్టీని బతికించుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారు
విలేకరుల సమావేశంలో పరిగి ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment