ఇంటర్
ప్రాక్టికల్స్‌కు
అనంతగిరి: నేటి నుంచి జరిగే ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్ తెలిపారు. పరీక్షలు ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించబోమన్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష విధుల్లో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు ఉండాలన్నారు. ఇంటర్ జనరల్ ద్వితీయ సంవత్సరంలో 3,782, ఒకేషనల్ ప్రథమ సంవత్సరంలో 797 మంది, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరంలో 1,336 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవుతున్నారని వివరించారు. జనరల్ ప్రాక్టికల్స్ పరీక్షల కోసం 38 సెంటర్లు, ఒకేషనల్ పరీక్షల కోసం 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిత్యం రెండు విడతల్లో బ్యాచ్‌ల వారీగా పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లు, ప్రాక్టికల్స్ టైమ్ టేబుల్ వారు చదువుతున్న కళాశాల ప్రిన్సిపాళ్ల వద్ద తీసుకోవచ్చని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్‌టీసీ తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు.
ఇంటర్ జిల్లా నోడల్ ఆఫీసర్ శంకర్‌నాయక్
Comments
Please login to add a commentAdd a comment