పుస్తకాలే ప్రపంచం | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలే ప్రపంచం

Published Tue, Dec 26 2023 1:24 AM | Last Updated on Tue, Dec 26 2023 1:24 AM

స్నాతకోత్సవ మందిరం ప్రాంగణంలో చదువుకుంటున్న విద్యార్థులు  - Sakshi

స్నాతకోత్సవ మందిరం ప్రాంగణంలో చదువుకుంటున్న విద్యార్థులు

ఏయూక్యాంపస్‌: వారు అక్షర నేస్తాలు...పుస్తక ప్రియులు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అధికశాతం మంది నిత్యం అక్కడ పుస్తకాలతో మనకు దర్శనమిస్తుంటారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా గ్రంథాలయం, స్నాతకోత్సవ మందిరం, ఆర్ట్స్‌ కళాశాల పరిసర ప్రాంతాల్లో వీధిదీపాల వద్ద చదువుకుంటూ మనకు కనిపిస్తారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే దృఢ సంకల్పంతో వీరు వర్సిటీని వేదికగా చేసుకుని తమ లక్ష్య సాధన కోసం నిత్యం పరిశ్రమిస్తున్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూ –2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరిలో దీనికి సంబంధించిన పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగాల్లో మెత్తం 899 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వీటిని సాధించాలనే లక్ష్యంతో వర్సిటీ ప్రాంగణంలో పదుల సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు పుస్తకాలే ప్రపంచంగా గడుపుతున్నారు.

రోజూ ఒక నిర్ధిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుని, సమయం వృథా కాకుండా వీరు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఆధునికత సాంకేతికతను సైతం వీరు అందిపుచ్చుకుంటున్నారు. గ్రూప్‌ 2 పరీక్షకు సిద్ధమవుతూ నిత్యం ఒక నమూనా పరీక్ష (మాక్‌ టెస్ట్‌)కు సైతం హాజరవుతున్నారు. తమ సెల్‌ఫోన్‌లోనే ప్రత్యేకంగా రుసుము చెల్లించి నిత్యం మాక్‌ టెస్ట్‌లతో తమ జ్ఞానాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆన్‌లైన్‌ యాప్‌లకు మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది కాలానికి ప్రత్యేక రుసుము చెల్లించి పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తున్నాయి. మరికొంత మంది ఆన్‌లైన్‌లో నిపుణులు పాఠాలు, సబ్జెక్ట్‌ నిపుణుల ప్రసంగాలు వింటూ కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. మరికొంత మంది పుస్తకాల్లో ముఖ్యమైన అంశాలను చదివిన వెంటనే నోట్స్‌ రూపంలో రాసుకుంటున్నారు. ప్రముఖ సంస్థలు ప్రచురించిన స్టడీ మెటీరియల్స్‌ను సైతం స్నేహితుల నుంచి సంగ్రహించుకుని చదువుకుంటున్నారు.

వర్సిటీలో ప్రస్తుతం పీజీ కోర్సులు చేస్తున్న విద్యార్థులతో పాటు, ఇప్పటికే పీజీ, బీఈడీ వంటి కోర్సులో ఏయూలో పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు సైతం గ్రూప్‌ 2 పరీక్షలకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కొంతమంది ప్రైవేటు హాస్టల్స్‌లో ఉంటూ, మరికొంత మంది స్నేహితులతో కలిసి ఇళ్లు అద్దెకు తీసుకుని చదువుకుంటున్నా రు. నెలకు రూ.5 వేల వరకు అద్దెకు, భోజనానికి వెచ్చిస్తూ పరీక్షల కోసం నిత్యం వర్సిటీలో ప్రశాంత వాతావరణంలో చదువుకుంటూ తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. సోమవారం క్రిస్మస్‌ రోజున సైతం రాత్రి చలిలో వీరు పుస్తకాలను వదలకుండూ చదువుకుంటూ కనిపించారు. పండుగలు, స్నేహితులు, ఫంక్షన్ల ఇలా అన్నీ పక్కన పెట్టి కేవలం ఉద్యోగం పొందడం లక్ష్యంగా సాధన చేస్తున్నారు.

గ్రూప్‌–2కి సన్నద్ధమవుతున్న విద్యార్థులు

వర్సిటీ పరిసరాల్లో ప్రిపరేషన్‌

చలిలోనూ..వీధి దీపాల మధ్య చదువులు

No comments yet. Be the first to comment!
Add a comment
చలిలో స్వెట్టర్‌ వేసుకుని చదువుకుంటున్న విద్యార్థులు 1
1/4

చలిలో స్వెట్టర్‌ వేసుకుని చదువుకుంటున్న విద్యార్థులు

గ్రంథాలయం పరిసరాల్లో ...2
2/4

గ్రంథాలయం పరిసరాల్లో ...

వీధి దీపం వెలుగులో..3
3/4

వీధి దీపం వెలుగులో..

ఫోన్‌లో మాక్‌ టెస్ట్‌ రాస్తున్న విద్యార్థి 4
4/4

ఫోన్‌లో మాక్‌ టెస్ట్‌ రాస్తున్న విద్యార్థి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement