ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళనలు
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 13 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేపట్టనున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ కార్యాచరణను ప్రకటించిందన్నారు. ఈ నెల 13న ధాన్యం సేకరణపైన, 27వ తేదీన పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా, జనవరి 3వ తేదీన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, కుంభా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రమణమూర్తిరాజు, అన్నంరెడ్డి అదీప్‌రాజ్, భాగ్యలక్ష్మి, తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయ్‌కుమార్, తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, చెంగల వెంకటరావు, శోభా హైమావతి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, జెడ్పీ వైస్ చైర్మన్ గిరిబాబు, బి.సత్యవతి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, కొర్పొరేషన్ల మాజీ చైర్మన్లు జాన్ వెస్లీ, పివిఎస్‌ఎన్ రవి, శోభాస్వాతి రాణి , చొక్కాకుల వెంకటరావు, పేర్ల విజయ్‌చందర్, పోతిన శ్రీనివాసరావు, సుజాత సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్, ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, గొలగాని శ్రీనివాసరావు పాల్గొన్నారు.
13న ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాల అందజేత
27న పెంచిన విద్యుత్ చార్జీలకు
వ్యతిరేకంగా నిరసన
జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్
బకాయిలపై ఆందోళన
వైఎస్సార్‌సీపీ శ్రేణులతో
శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స
Comments
Please login to add a commentAdd a comment