గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సపై సదస్సు
ఏయూక్యాంపస్: మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని ఓ హోటల్‌లో ఇండియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ ఆంకాలజీ 4వ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా వంద మందికి పైగా ప్రతినిధులు పాల్గొనగా.. మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆస్పత్రి ఎండీ డాక్టర్ వి.మురళీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ చికిత్సలో అపార అనుభవం కలిగిన 30 మంది నిపుణులు పలు అంశాలు వివరించారు. సదస్సులో భాగంగా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ క్యాన్సర్ల నిర్ధారణ, చికిత్స, నిర్వహణలో తాజా పురోగతిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కోర్సులో కేసు–ఆధారిత చర్చలు, ఆసక్తిదాయక ప్రసంగాలు, తాజా పరిశోధనలు, వైద్య రంగంలో జరుగుతున్న మార్పులు, ఆవిష్కరణలపై విస్తృతంగా చర్చించారు. డాక్టర్ పుష్ప బారిక్, డాక్టర్ సదాశివుడు, డాక్టర్ కృపాశంకర్ తదితరులు పాల్గొని విశిష్ట ప్రసంగాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment