రష్యాలో గాజువాక వాసి మృతి
గాజువాక: రష్యాలో వెల్డర్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి మృతి చెందాడు. మరణానికి కచ్చి తమైన కారణాలు తెలియలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. వివరాలివీ. గాజువాకలోని ఎల్‌బీఎస్ నగర్‌కు చెందిన ఎం.నారాయణ(35) స్థానిక ప్రజ్ఞా వెల్డింగ్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా ఏడాదిన్నర కిందట వెల్డర్‌గా పని చేసేందుకు రష్యాలోని ఒక కంపెనీకి వెళ్లాడు. ఏడాది అగ్రిమెంట్ ముగిసిన వెంటనే ఇక్కడికి తిరిగి ఇచ్చాడు. ఇక్కడ 20 రోజులు గడిచిన తర్వాత ఆ కంపెనీ నారాయణ అగ్రిమెంట్‌ను రెన్యువల్ చేయడంతో 6నెలల కిందట మళ్లీ రష్యా వెళ్లాడు. అయితే అతడు మృతి చెందినట్టు ఆ కంపెనీ ప్రతినిధులనుంచి ఈ నెల 13న తమకు సమాచారం అందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణకు భార్య కుసుమ, ఇద్దరు కుమారులు, తల్లి, తండ్రి ఉన్నారు. మృత దేహం ఢిల్లీ వరకు వచ్చిందని, సోమవారం గాజువాకకు వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment