ఏయూ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని రాక
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నట్లు వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. వర్సిటీ 2025 సంవత్సర క్యాలెండర్‌ను రిజిస్ట్రార్ ధనుంజయరావు, ఇతర ఆచార్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని ఏయూలో ప్రత్యేకంగా సెంటినరీ టవర్, సెంటినరీ పార్కులను నిర్మించనున్నట్లు తెలిపారు. 2026 జనవరి 26న సెంటినరీ వేడుకల ప్రధాన కార్యక్రమానికి ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. 2025 ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమయ్యే శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని విభిన్న సదస్సులు, వర్క్ షాప్‌లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్.ధనంజయరావు, అకడమిక్ డీన్ ఆచార్య కె.ఈశ్వర్ కుమార్, ఏయూ కళాశాలల ప్రిన్సిపాళ్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం న్యూ ఇయర్ క్యాలెండర్లను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment