నేటి నుంచి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Published Thu, Jan 2 2025 1:35 AM | Last Updated on Thu, Jan 2 2025 1:35 AM

-

మురళీనగర్‌: కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 2 నుంచి 4 వరకు మూడు రోజులపాటు 27వ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.నారాయణరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు రెండేళ్లకోసారి సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్‌ మీట్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా విశాఖ రీజియన్‌ ప్రాంతీయ గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్‌రాజు ప్రారంభిస్తారని చెప్పారు. 8 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లతోపాటు, 19 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలోని 16 కాలేజీల నుంచి మొత్తం 1,116 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు. వీరికి భోజనం, ఇతర వసతి ఏర్పాట్లు కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్‌ మీట్‌ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement