స్టాఫ్‌ నర్సుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ నర్సుల ఖాళీల భర్తీకి దరఖాస్తులు

Published Thu, Jan 2 2025 1:35 AM | Last Updated on Thu, Jan 2 2025 1:35 AM

-

మహారాణిపేట: ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్‌ నర్సు పోస్టులకు ఏడాది ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ సంచాలకులు పి.రాధారాణి తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 15లోగా రేసపువానిపాలెం, డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలోని తమ కార్యాలయంలో సమర్పించాల్సిందిగా సూచించారు. పూర్తి వివరాల కోసం https://nagendrasvst.wordpress.com ను సందర్శించాల్సిందిగా కోరారు. నోటిఫికేషన్‌ నం.05/2022, 01/2023 ద్వారా ఇప్పటికే నియమితులై, పనిచేస్తున్న వారు ఈ పోస్టులకు అనర్హులని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement