వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ● పార్టీ కార్యాలయంలో న్యూ ఇయర్ వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీ నగర కార్యాలయంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో భారీ కేకును కట్‌చేసి సంబరాలు నిర్వహించారు. పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్ మాట్లాడుతూ కొత్త ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. సమష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్, విశాఖ తూర్పు పరిశీలకులు మొల్లి అప్పారావు, దంతులూరి దిలీప్‌కుమార్, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, తోట పద్మావతి, పీవీ సురేష్, బిపిన్ కుమార్ జైన్, గుండాపు నాగేశ్వరరావు, బల్ల లక్ష్మణ, ముర్రు వాణి, కొండబాబు, కెల్లా సునీత సత్యనారాయణ, పద్మారెడ్డి, రెయ్యి వెంకట రమణ, కో–ఆప్షన్ సభ్యులు ఎండీ షరీఫ్, సేనాపతి అప్పారావు, పార్టీ ముఖ్య నాయకులు జహీర్ అహ్మద్, గండి రవి, నడింపల్లి కృష్ణంరాజు, బోని శివరామకృష్ణ, పేడాడ రమణి కుమారి, ద్రోణంరాజు శ్రీవత్సవ్, దొడ్డి కిరణ్, అల్లంపల్లి రాజాబాబు, రామన్నపాత్రుడు, దేవరకొండ మార్కండేయులు, పెండ్ర అప్పన్న, పోతిన హనుమంతు, పల్లా దుర్గా, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, వివిధ వార్డులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment