ఆరిలోవ: సీఐడీ విశాఖ రీజియన్ కార్యాలయానికి యాన్యువల్ రోలింగ్ అవార్డులు లభించాయి. మొట్టమొదటిసారిగా ఈ అవార్డులను సీఐడీ అడిషనల్ డీజీపీ ప్రకటించారు. ఇందులో భాగంగా విశాఖ రీజియన్ కార్యాలయానికి మూడు అవార్డులు వరించాయి. వాటిలో బెస్ట్ ఇన్ ఇన్విస్టిగేషన్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇన్‌స్పెక్టర్ ఎం.శేషుకు, బెస్ట్ ఇన్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇన్‌స్పెక్టర్ కె.పైడిపునాయుడుకు ఈ అవార్డులు లభించాయి. వీరితో పాటు ఉత్తమ రీజనల్ ఆఫీస్‌కు గాను విశాఖ రీజియన్ కార్యాలయం అధికారి ప్రేమ్ కాజల్‌కు రోలింగ్ అవార్డు లభించింది. అవార్డులను సోమవారం మంగళగిరిలో అందజేసినట్టు సీఐడీ రీజినల్ అధికారులు తెలిపారు. ప్రశంసా పత్రాలు, షీల్డ్, నగదు అందకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment