ట్రాఫిక్ ఆంక్షలు
విశాఖ సిటీ: నగరంలో 31వ తేదీ రాత్రి 8 నుంచి తెల్లవారు 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు.
● వేమన మందిరం నుంచి డీఎల్‌ఓ జంక్షన్ వరకు గల ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఆయా సమయాల్లో రాకపోకలు అనుమతించరు.
● జనవరి 1వ తేదీన సంపత్ వినాయక గుడి వద్ద వాహనాలకు పూజ చేసుకునేందుకు వాహనాలను గోఠీ సన్స్ నుంచి కళామందిర్ వరకు రోడ్డుకు ఎడమ వైపున పార్కింగ్ చేసుకోవాలి.
● పార్క్ హోటల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిర్ణీత సమయంలో వాహనాల రాకపోకలు, పార్కింగ్‌లకు అనుమతిలేదు.
● 31వ తేదీ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు బీఆర్‌టీఎస్ రోడ్ హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి నుంచి ఎన్‌ఏడీ జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు, అలాగే మద్దిలపాలెం నుంచి రామాటాకీస్ బీఆర్‌టీఎస్ మధ్య లైన్, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అండర్‌పాస్ మూసివేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment