నేవీడే విన్యాసాలు
ఏయూక్యాంపస్: నావికాదళ విన్యాసాలకు బీచ్‌రోడ్డు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. శనివారం సాయంత్రం విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా జరగనున్న నావికాదళ విన్యాసాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చినా వీక్షించేందుకు వీలుగా నేవీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆర్‌కే బీచ్ నుంచి పోలీస్‌మెస్ వరకు తీరంలో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. సందర్శకులు సాగర తీరంలో కూర్చుని ఎల్‌ఈడీ తెరలపై వేడుకలు వీక్షించవచ్చు. ప్రధాన వేదికకు రెండు వైపులా సీటింగ్, ఇసుక తిన్నెలపై సైతం కుర్చీలు వేసి సీటింగ్ సదుపాయం కల్పించారు. వీటికి ప్రత్యేక పాస్‌లను జారీ చేశారు. సిల్వర్‌స్పూన్ రెస్టారెంట్ నుంచి పోలీస్ మెస్ వరకు ఉన్న ఇసుక తిన్నెలచుట్టూ కేవలం ఫెన్సింగ్ వేశారు. నావికా విన్యాసాలు ప్రారంభమయ్యే సమయానికి గంట ముందుగానే ప్రజలు ప్రాంగణానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నావికా విన్యాసాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు, జీవీఎంసీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. శనివారం మధ్యాహ్నం నుంచి బీచ్‌రోడ్డులోకి వాహనాలను అనుమతించరు. వీక్షకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మైదానాలలో తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. సాయంత్రం 4.40 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ విన్యాసాలు జరుగుతాయి.
ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో
కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న లేజర్ షో, డ్రోన్ షోలు మరింత కొత్తదనాన్ని తీసుకువస్తున్నాయి. నావికాదళ సిబ్బంది సంగీత బృందం బీటింగ్ రిట్రీట్, తుపాకులతో చేసే కవాతు వారి క్రమశిక్షణ, ఏకాగ్రతలకు ప్రతీకగా నిలుస్తాయి. పెద్దసంఖ్యలో నావికాదళ ఉన్నతాధికారులు, సిబ్బందితో పాటు, నగరవాసులు ఈ విన్యాసాలను తిలకించడానికి రానున్నారు. గతంలో కంటే విస్తృత స్థాయిలో దీనికోసం నావికాదళం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. నేవీ విన్యాసాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు, ఫైటర్ జెట్‌లు, సబ్‌మైరెన్‌లు భాగం కానున్నాయి. నావికాదళానికి వెన్నెముకగా నిలిచే మైరెన్ కమాండోల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారత నావికాదళ సిబ్బంది ధైర్యం, సాహసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపే విధంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు నమూనా విన్యాసాలు విజయవంతమయ్యాయి.
వేడుకలకు సర్వం సిద్ధం
సీటింగ్‌కు ప్రత్యేక పాస్‌లు మంజూరు
బీచ్‌రోడ్డులో పటిష్ట భద్రత
వీక్షకులకు ఉపయుక్తంగా ఎల్‌ఈడీల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment