బుడగ జంగాల సందడి
డాబాగార్డెన్స్: నగరంలో బుడగ జంగాళ్లు సందడి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి రేవు నుంచి సుమారు 230 మంది బుడగ జంగాళ్లు భోగి ముందు రోజే నగరానికి చేరుకున్నారు. వీరు నగరంలోని వెలంపేట, ప్రసాద్‌గార్డెన్స్, కల్లుపాకలు, కొబ్బరితోట, రామకృష్ణాజంక్షన్ ఏరియా, అల్లిపురం, మహారాణిపేట, సాలిపేట, కోటవీధి, వన్‌టౌన్ ఏరియా, పంజా జంక్షన్, వీరు నగరంలోని వెలంపేట, ప్రసాద్‌గార్డెన్స్, కల్లుపాకలు, కొబ్బరితోట, రామకృష్ణాజంక్షన్, అల్లిపురం, మహారాణిపేట, సాలిపేట, కోటవీధి, వన్‌టౌన్, పంజా జంక్షన్, పెయిన్‌దొరపేట, సూర్యాబాగ్, డాబాగార్డెన్స్, లక్ష్మీనగర్, పద్మానగర్, చిలకపేట వంటి మురికివాడలతో పాటు అఫీషియల్ కాలనీ, ఎంవీపీ, విశాలాక్షినగర్, సీబీఎం కాంపౌండ్ వంటి ప్రాంతాల్లో మూడు రోజుల పాటు తిరుగుతూ, అపార్టుమెంట్లు, కాలనీల్లోని ఇళ్లకు వెళ్లి పితృదేవతలకు పూజలు నిర్వహించారు. నేరుగా పితృదేవతలే ఇంటికి దిగివచ్చినట్టు పొగుడుతూ.. ఎంతో కొంత నగదు తీసుకుని దీవించారు. ప్రతిరోజూ ఒకే చోటకు చేరుకుని.. వివిధప్రాంతాలకు వెళ్లడం, పొద్దుపోగానే మళ్లీ అదే స్థలంలో కలుసుకునే వారు. కనుమ ముగిసిన తర్వాత వీరంతా తిరిగి కోటిపల్లి రేవుకు బయలుదేరారు. అలాగే నగర శివార్లతో పాటు కొత్తవలస, చింతల అగ్రహారం, ఆనందపురం, కొమ్మాది, దేవరాపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన గంగిరెద్దుల వారు కూడా పండగ రోజుల్లో నగరంలో సండి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment