ఏపీఎస్‌ఆర్టీసీ భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
డాబాగార్డెన్స్: ఏపీఎస్‌ఆర్టీసీలో భద్రతా మాసోత్సవాలను గురువారం ప్రాంతీయ మేనేజర్ బి.అప్పలనాయుడు ప్రారంభించారు. ఈ మాసోత్సవాలు ఈ నెల 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ సురక్షితమైన ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఏపీఎస్‌ఆర్టీసీని భద్రంగా నడుపుకోవాలని డ్రైవర్లకు సూచించారు. డ్రైవర్లు, మెయింటెనెన్స్ సిబ్బంది వాహనాలను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని సూచించారు. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చే విషయంలో భద్రతా నియమాలు కచ్చితంగా పాటించాలన్నారు. మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 17 నుంచి 22 వరకు మెయింటెనెన్స్ స్పెషల్ డ్రైవ్, 23న డ్రైవర్స్ డే సందర్భంగా సేఫ్టీ డ్రైవర్ కార్యక్రమాలు, 25 నుంచి 28 వరకు డ్రైవర్లకు సేఫ్టీ డ్రైవింగ్‌పై శిక్షణ, 29 నుంచి ఫిబ్రవరి 4 వరకు డ్రైవర్లకు వైద్య పరీక్షలు, 5, 6 తేదీల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్, 7 నుంచి 10 వరకు రక్తదాన శిబిరాలు, రూట్ సేఫ్టీ ఆడిట్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. చివరి రోజున రీజియన్ పరిధిలో ముగ్గురు ఉత్తమ డ్రైవర్లకు అవార్డులు అందజే స్తామన్నారు. డిపో మేనేజర్లు గంగాధర్, అరుణ్‌కుమారి, సుధాకర్, సూపర్‌వైజర్లు మాధురి, రామకృష్ణ, హిమబిందు, ఈశ్వరరావు, గౌరీ పాల్గొన్నారు.
నేటి నుంచి రహదారి భద్రతా మాసోత్సవాలు
మహారాణిపేట: జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై రవాణా, పోలీసు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు– 2025 పోస్టర్లను, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇతరుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కొల్పోవచ్చని, ప్రమాదాలు జరగకుండా సురక్షిత డ్రైవింగ్‌పై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, డ్రైవింగ్ స్కూల్ ఇన్‌స్ట్రక్టర్స్, రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ సిబ్బందితో వలంటీర్లను గుర్తించి శుక్రవారం నుంచి శిక్షణ ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ జి.ఆదినారాయణ, మోటార్ వెహికల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, రవాణా, పోలీస్, శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment