అమ్మో..అంబులెన్స్
ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ ఫొటోలే నిదర్శనం. ఒక అంబులెన్సులో క్షతగాత్రులను, వివిధ రోగాలతో బాధపడుతున్న వారిని కుక్కేశారు. బస్సులో ఎక్కించినట్లు అంబులెన్సులో చోటు లేకపోయినా రోగులను నిలబెట్టేసి మరీ ఓపీ నుంచి వార్డులకు తరలించారు. అందులో కొంత మంది ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా ఉన్నప్పటికీ.. ఎవరూ పట్టించుకోలేదు. ఒక చిన్నారిని ఎత్తుకొని తీసుకువెళుతున్న దృశ్యం అందరి కలిచివేసింది. రోగులను వీల్‌చైర్లు, స్ట్రెచర్‌లో తరలించాల్సి ఉన్నా..సిబ్బంది ఇలా ఇష్టానుసారంగా అంబులెన్సులో కుక్కి తీసుకువెళ్లడంపై రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment