హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను 30లోగా పూర్తి చేయాలి
సచివాలయ సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: ప్రభుత్వం తలపెట్టిన హౌస్ హోల్డ్ సర్వే ప్రక్రియను ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పేర్కొన్నారు. జోన్ –3 పరిధి న్యూ వెంకోజీపాలెం–1 సచివాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన పలు అంశాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరు, ప్రగతి సాధన, హాజరు శాతం తదితర అంశాలపై ఆరా తీస్తూ ఆయా రికార్డులను తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిర్దేశిత లక్ష్యాలను చేరుకునేందుకు నిత్యం శ్రమించాలని హితవు పలికారు. ఆయన వెంట జిల్లా సచివాలయాల కో–ఆర్డినేటర్ ఉషారాణి, జోనల్ కమిషనర్ శివప్రసాద్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment