మహారాణిపేట: జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ చాంబర్ సమీపంలోని వీసీ హాలులో, జెడ్పీ సమావేశ మందిరంలో ఒకటి నుంచి ఏడు వరకు గల స్థాయీ సంఘ సమావేశాలు వేర్వేరుగా ఉదయం నుంచి నిర్దేశిత సమయాల్లో జరుగుతాయని చెప్పారు. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు ఈ సమావేశాలకు హాజరుకావాలని కోరారు. ఉదయం 10.30 గంటల నుంచి సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని, జిల్లాలోని అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment