గణతంత్ర వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
మహారాణిపేట: జనవరి 26న పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే గణతంత్ర వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ పేర్కొన్నారు. వేడుకల నిర్వహణపై పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారులతో కలిసి శుక్రవారం కలెక్టరేట్ మీటింగు హాలులో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిబింబిస్తూ శకటాలను తీర్చిదిద్దాలని, స్టాళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలియపరిచేలా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, గీతాలాపన, ప్రగతి నివేదిక ఇతర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులంతా సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో భాగంగా ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వర్తించాలో స్పష్టంగా తెలుపుతూ జేసీ దిశానిర్దేశం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, పోలీస్, రెవెన్యూ, ఇతర విభాగాల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment