20, 21 తేదీల్లో జాబ్‌మేళాలు
సీతంపేట: ఈ నెల 20వ తేదీన కంచరపాలెం ఎంప్లాయిమెంట్ కార్యాలయం, 21వ తేదీన పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్‌మేళాలు నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. 20న జరిగే జాబ్ మేళాలో బీ డేటా టెక్నాలజీస్, ఇండస్ బ్యాంక్, నవతా రోడ్ ట్రాన్స్‌పోర్టు, పే టీఎం కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. టెన్త్ పాస్/ఫెయిల్, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 8555868681 నంబర్‌లో సంప్రదించాలన్నారు. 21న పెందుర్తి పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే జాబ్‌మేళాలో టావ్ డిజిటల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (యూస్ బేస్డ్ కంపెనీ), కెల్ గ్రూప్, టీమ్‌లీజ్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఏదైనా డిగ్రీ, డిప్లమా, బీటెక్ విద్యార్హత గల విద్యార్థులు మేళాలో పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 7702506614 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment