ఎవరికి వారే.. యమునా తీరే..!
స్టీల్‌ప్లాంట్ ప్యాకేజీ ప్రకటనలో జనసేన నేతలు పూర్తిస్థాయిలో పవన్ కల్యాణ్ పాత్రనే కీలకమని చెబుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రెస్‌మీట్ నిర్వహించి మరీ పదే పదే ప్రధాని నరేంద్ర మోదీని పవన్ కల్యాణ్ కలిసి విజ్ఞప్తులు చేయడం వల్లే ప్యాకేజీ వచ్చిందంటూ ప్రకటించారు. తద్వారా ప్రధానపాత్ర పవన్‌దేనని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పవన్ కల్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు. మరోవైపు ప్యాకేజీ ప్రకటన చేసిన వెంటనే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఆ పార్టీ ఎంపీ, ఇతర నేతలు ప్రెస్‌మీట్లు నిర్వహించి చంద్రబాబు గొప్పతనమని చెబుతూ... పార్టీ కార్యాలయం వద్ద టపాసులు కాల్చారు. ప్యాకేజీ ప్రకటనకు తామే చాంపియన్ అనే చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ నేతలు ఇది మోదీ 3.0 ప్రకటన అని అంటున్నారు. గతంలో ఏదైనా విషయంపై అన్ని పార్టీల నేతలు టీడీపీ కార్యాలయంలో ఉమ్మడిగా కలిసి మాట్లాడేవారు. ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కార్మికులు మాత్రం ప్రైవేటీకరణను నిలిపివేశామన్న ప్రకటన లేకుండా.. సెయిల్‌లో విలీనాన్ని ప్రకటించకుండా ఈ సంబరాలు ఎందుకంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తెరమరుగు చేసి... ప్యాకేజీకే పరిమితమయ్యేలా చేసిన ఈ కూటమి నేతల వ్యవహారాన్ని గుర్తుచేసుకొని ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిపివేసే వరకూ విశ్రమించకూడదని నిర్ణయించాయి.
Comments
Please login to add a commentAdd a comment