త్రివర్ణ తీరం
ఏయూక్యాంపస్: దేశ రక్షణ దళాల 9వ విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని శనివారం బీచ్‌రోడ్డులో ఘనంగా నిర్వహించారు. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి, కోస్టల్ బ్యాటరీ కూడలి వరకు త్రివర్ణ పతాకాలతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. భారత్ మాతాకీ జై అంటూ విశ్రాంత ఉద్యోగుల నినాదాలతో సాగర తీరం పులకించింది. తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షణ దళాల విశ్రాంత ఉద్యోగుల దినోత్సవాన్ని తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్–కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో నేవీ ఫౌండేషన్ అధ్యక్షుడు వైస్ అడ్మిరల్ రిటైర్డ్ వీకే నంబల్ల, వెటరన్ సెయిల్స్ ఫోరం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ (రిటైర్డ్) డాక్టర్ పి.చంద్రశేఖర్ పాల్గొన్నారు. తూర్పు నావికాదళం బ్యాండ్ తమ సంగీతంతో ముందుకు సాగగా, నేషనల్ క్యాడెట్ కార్ప్స్, సైనిక్ స్కూల్ విద్యార్థులు, సీ క్యాడెట్ కార్ప్స్ కవాతుతో ముందు నడిచారు. వీరిని అనుసరిస్తూ విశ్రాంత సైనికోద్యోగులు, నావికాదళ సిబ్బంది, అధికారులు ర్యాలీలో పాల్గొన్నారు. నిస్వార్థ సేవలు అందించి, పదవీ విరమణ చేసిన వారిని వైస్ అడ్మిరల్ రాజేష్ పెంథార్కర్ అభినందించారు. తమ సిబ్బంది సంక్షేమం, భద్రత కోసం నేవీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం నేవీలో సేవలందిస్తున్న సిబ్బందిని, విశ్రాంత సిబ్బందితో అనుసంధానం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తూర్పు నావికాదళం నిర్వహించింది.
జాతీయ జెండాలు చేతబూని..
ర్యాలీ ప్రారంభిస్తున్న తూర్పు నావికాదళ ఫ్లాగ్ ఆఫీసర్ –కమాండింగ్ ఇన్ చీఫ్ రాజేష్ పెంథార్కర్
Comments
Please login to add a commentAdd a comment