యువతలో నైపుణ్యాభివృద్ధికి ఇంటెర్న్‌షిప్
సీతంపేట: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా వచ్చే ఐదేళ్లలో సుమారు కోటి మందికి పైగా యువతకు ప్రధానమంత్రి ఇంటర్నెషిప్ ఇవ్వనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు తెలిపారు. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు. ఎంపికై న వారికి ఒక్కొక్కరికి నెలకు రూ.5 వేలు చొప్పున ఏడాదికి రూ.60 వేలు స్టైఫండ్ చెల్లిస్తుందన్నారు. కంపెనీలో చేరేముందు ఇచ్చే రూ.6 వేలు వన్‌టైం గ్రాంట్ కూడా యువతకు ఉంటుందన్నారు. ఇంటెర్న్‌షిప్‌లో చేరే వారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంటుందని, ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ఆసక్తి గల వారు పీఎంఇంటెర్న్‌షిప్ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9494202677, 9848438254 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment