మహారాణిపేట: విశాఖ నగరం, గ్రామీణ ప్రాంతాల్లో నడుపుతున్న ఆస్పత్రులు, క్లినిక్లు, డెంటల్ క్లినిక్స్, ల్యాబ్‌లు, స్కానింగ్ కేంద్రాలు, ఫెర్టిలిటీ కేంద్రాలు తప్పనిసరిగా రిజిస్టర్/రెన్యువల్ చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌వో) డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. లేకుంటే క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంటు యాక్ట్–2002 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఆస్పత్రులు, క్లినిక్స్ ,ల్యాబ్‌లు https@// clinicalesttact.ap.gov.in, స్కానింగ్ కేంద్రాలు https@//pepndt.ap.gov. inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన కోరారు. అర్హత, అనుమతి లేని వారు వైద్యులుగా చలామణి అవుతున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు తప్పుడు వైద్యం చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని డీఎంహెచ్‌వో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment