విశాఖ విద్య : పాఠశాల విద్యలో తీసుకొస్తున్న సమూల మార్పులపై ఆ శాఖ డైరెక్టర్ వి.విజయ రామరాజు సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆంధ్ర యూనివర్సిటీ అంబేడ్కర్ అసెంబ్లీ హాల్లో సోమవారం జరిగిన వర్క్‌షాప్‌నకు విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల కలెక్టర్లు హరేందిర ప్రసాద్, విజయకృష్ణన్, దినేష్ కుమార్, అంబేడ్కర్‌తో పాటు, విద్యాశాఖ ఆర్జేడీ విజయ భాస్కర్, నాలుగు జిల్లాల డీఈవోలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా మోడల్ స్కూళ్ల ఏర్పాట్లు, క్లస్టర్ విధానం అమలు, యూపీ స్కూళ్లను సమీప హైస్కూళ్లలో విలీనానికి ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment