నేటి నుంచి కుష్టువ్యాధిగ్రస్తుల గుర్తింపు
మహారాణిపేట : ఈనెల 20 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అమలు చేసేందుకు జిల్లాలో 951 టీమ్‌లు వేశామని, వీరు ఇంటింటికి వెళ్లి అనుమానితులను గుర్తించి, సమీపంలో యూపీహెచ్‌సీకి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహిస్తారని డీఎంహెచ్‌వో డాక్టర్ పి.జగదీశ్వరరావు చెప్పారు. ఈ ఏడాది ఇప్పుటివరకు జిల్లాలో 85 కుష్టువ్యాధి గ్రస్తులను గుర్తించామని, వీరికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ నివారణాధికారి డాక్టర్ జి.పూర్ణేంద్రబాబు, కేజీహెచ్ ఆర్‌ఎంవో డాక్టర్ దవళ భాస్కరరావు, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ అప్పారావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment