జీవీఎంసీ కమిషనర్ బదిలీ
జీతాలు చెల్లించాలని గెస్ట్ ఫ్యాకల్టీల ఆందోళన
8లో
విశాఖ సిటీ: జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవీఎంసీ కమిషనర్‌గా ఎవరిని నియమించలేదు. 2016 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్‌కుమార్ 2024, జూలై 23వ తేదీన జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. నగరాభివృద్ధితో పాటు, ప్లాస్టిక్ నివారణ, ప్రాజెక్టులు, ఇతర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించారు. నగర సుందీకరణతో పాటు, జాతీయ, అంతర్జాతీయంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా విధులు నిర్వహించారు. తాజాగా ఆయన్ని సీడీఎంఏగా ప్రభుత్వం బదిలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment