సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ నిర్ధారణ | - | Sakshi
Sakshi News home page

సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ నిర్ధారణ

Published Fri, Nov 22 2024 12:43 AM | Last Updated on Fri, Nov 22 2024 12:43 AM

సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ నిర్ధారణ

సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ నిర్ధారణ

విజయనగరం ఫోర్ట్‌: స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ ఓపీ విభాగాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ పద్మలీల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌ సంబంగి అప్పలనాయుడు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్యాన్సర్‌ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదన్నారు. సర్వజన ఆస్పత్రిలో క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణతో పాటు చికిత్స అందిస్తామని తెలిపారు. సర్జికల్‌ అంకాలజిస్టు త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. క్యాన్సర్‌ వ్యాధిని నిర్ధారించే పాప్సిమీర్‌, ఎఫ్‌ఎన్‌ఏసీ పరీక్షలు సర్వజన ఆస్పత్రిలో చేస్తున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో మెడికల్‌ అంకాలజిస్టు పోతుల విజయలక్ష్మి, డెంటల్‌ విబాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ జనార్దనరావు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కామేష్‌, పెథాలజీ హెచ్‌ఓడీ బసుమిత్రాదాస్‌, రేడియాలజీ హెచ్‌ఓడీ శ్రీధర్‌, జనరల్‌ సర్జరీ హెచ్‌ఓడీ పి.ఎ.రమణి, నోడల్‌ ఆఫీసర్‌ శివకుమార్‌, బొత్స సంతోష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ఓపీ విభాగం ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement